Monday 22 April 2013

హనుమాన్ జయంతి



చైత్ర మాసములోని పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకొంటారు.  కొన్ని పంచంగాముల ప్రకారము అశ్విని మాసములోని చతుర్ధశి నావు హనుమాన్ జయంతి అని, కొన్ని పంచంగాముల ప్రకారము చైత్ర మసములోని పౌర్ణమి నాడు అని చెప్పడము జరుగుతుంది. ఈ సంవత్సరము మార్చి 25వ తేదీన హనుమాన్ జయంతి వచ్చినది. హనుమంతుడు సూర్యోదయం నాడు జన్మించారు. ఆ సమయములో అందరికి కూడా ప్రసాదము పంచడము జరుగుతుంది.
పూజను చేసేటప్పుడు ఉంగరము వేలుతో సింధూరమును పెట్టవలెను. జిల్లేడు ఆకులను కానీ, పువ్వులను కానీ సమర్పించవలెను. వీటిని అయిదు సంఖ్యలో లేదా అయిదు గుణంకితములలో(5, 10, 15...ఇలా) అర్పించవలెను. రెండు ఊదబత్తిలను వెలిగించి, కుడిచేతి యొక్క బొటన వేలు మరియు చూపుడు వేలుతో పట్టుకొని మూడు సార్లు వృత్తాకారములో తిప్పవలెను.
హనుమంతునికి అయిదు లేదా అయిదు గుణాంకములలో ప్రదిక్షణను చెయ్యాలి.  

No comments:

Post a Comment