Monday, 28 April 2014

ఉగాది పండుగ


బ్రహ్మదేవుడు ఏరోజైతే ఈ సృష్టిని నిర్మించినారో ఆ రోజునే ఉగాదిని జరుపుకొంటాము.. ఉగాది అనే పదము ‘యుగాది’ నుండి నిర్మితమైనది. ‘యుగాది’ అనగా యుగము ఆరంభము అయిన రోజు.
‘ఉగాది’ ని మరాఠీ లో 'గుడిపాడ్వ' అని అంటారు. ఐతే ఈ పేరు ఎలా వచ్చిందో మరియు ఆ పేరుతోనే ఎందుకు పిలుస్తారో ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం.
పాడవ లో 'పాడ్'అనగా సంపూర్ణము లేదా పరిపక్వము చెందినది .ఉదాహరణకు మామిడికాయ పక్వానికి వచ్చే పూర్వపు అవస్థను మరాఠీ లో ‘పాడ్’(పక్వానికి వచ్చిన మామిడి ) అంటారు . మామిడికాయ పక్వానికి వచ్చ్హాక దాన్ని చెట్టు మిద ఉంచవలసిన అవసరం లేదు దాన్ని తెంపి మెరుగైన పరిస్థితులు అందిస్తే అది తీయగా రుచికరమైన పండు గా తయారవుతుంది .దిని ద్వారా తెలిసినదేమి అనగా పక్వానికి వచ్చిన (పాడ్ )వచ్చిన మామిడికాయ పండు అవడానికి సిద్దంగా వుంటుంది దానికి చెట్టు మీదనే వుంచాల్సిన అవసరం లేదు .అది చెట్టు మీదనుండి తెంపిన తర్వాత కూడా పక్వించి రుచికరమైన పచ్చని పండుగా మారుతుంది.
పాడవా శభ్ధం లోని పాడ్ అంటే తెలుసుకున్నాం ఇప్పుడు 'వా' అర్థం చూద్దాము 'వా' అనగా ఆద్యాత్మిక శాస్త్రము లో వృద్ధి అని అర్థము.’పాడ్’ మరియు ‘వా’ శభ్డాలు కలిసి 'పాడ్వా'(ఉగాది) అవుతుంది.పాడ్ అనగా సంపూర్ణమైన మరియు వా అనగా వృద్ధి.అనగా సంపూర్ణత్వము లో ఇంకా వృద్ది జరిగి అది పరిపూర్ణమవుతుంది.
పాడ్వా శభ్దము ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. బ్రహ్మ దేవుడు సృష్టిని సాకారంగా చిత్రీకరించాడు అనగా 'పాడ్'(సంపుర్ణ ము)లో ఉత్పత్తి మార్పులు చేర్పులు చేస్తూ చేస్తూ అది ఇంకా చాలా అందంగా తయారవుతూ పరిపూర్ణతను సంతరించుకుంది.బ్రహ్మదేవుడు సృష్టి యొక్క పరిపూర్ణచిత్రమును సాకారము చేసిన రోజే గుడిపాడ్వా(ఉగాది) మరియు ఆ రోజు ధ్వజం (గుడి)ని నిలబెట్టడం పద్దతిగా మారింది. అందుకే ఈరోజును మరాఠీ లో 'గుడిపాడ్వా' (ఉగాది) అంటారు..
ఈ రోజు బ్రహ్మాండములో ప్రజాపతి తరంగములు అధికముగా పృథ్వీ మీదకు వస్తాయి. అందువలన వాటిని సంగ్రహించేందుకు ఈ ప్రార్థనను చెయ్యండి.
ఉగాది రోజు చేయించే ప్రార్థన ;
ఓ భగవంతుడా ! ఈ రోజు నీ నుండి లభించే శుభాశిర్వాదములు మరియు బ్రహ్మాండం నుండి వచ్చే సాత్విక తరంగాలు నాకు అధికంగా గ్రహించగలిగెట్టు చేయి .ఈ తరంగాలు గ్రహించే అర్హత నాకు లేదు .నేను నీకు సంపుర్ణ శరణాగతికి వచ్చాను.నువ్వు నాకు ఈ సాత్విక తరంగాలు ఎలా గ్రహించాలో నేర్పించు.ఇదే నీ చరణాల వద్ద నా ప్రార్థన ..

సాత్త్విక ద్రవ్యములను మాత్రమే తీసుకొనండి


సత్త్వ, రజ, తమ అని మూడు గుణాలు వుంటాయి..వీటిలో సాత్వికము మంచి గుణము..అయితే మనము తీసుకొంటున్న ఆహారములో ఏది సాత్త్వికము?? కూల్ డ్రింక్స్ పూర్తిగా తామసికమైనవి...ఈ బొమ్మలో ఎడమ నుంచి కుడి వైపునకు కనుక గమనిస్తే తామసిక పదార్థాల నుండి సాత్విక పదార్థాలుగా చూడవలెను..అనగా కూల్ డ్రింక్స్, టీ, ఆల్కహాల్ అధిక తమసికము..అదే విధముగా పళ్ళ రసాలు, కొబ్బరి నీరు మరియు ఆవు పాలు అధిక సాత్వికమైనవి..ఆవు పాలు అన్నింటికన్నా సాత్వికమైనవి..కాబట్టి మీరు ఎండా కాలములో కూల్ డ్రింక్స్ నకు బదులుగా కొబ్బరి బోండాం నీలు త్రాగండి..

ఆధునిక (పాశ్చాత్య) ఆహారము

ప్రస్తుతము చాల మంది ఇంటిలో తల్లి గని, సోదరి గాని చేసిన ఆహారమును భుజించకుండా బర్గర్, పిజ్జా, చైనీస్ ఫుడ్ మొదలగు ఫాస్ట్ ఫుడ్లకు అలవాటుపడ్డారు. ఈ ఆహారము తినడానికి రుచిగా అయితే ఉంటుంది. ఇవి తయారు చేయ్డానికి కూడా చాల సులభముగా ఉండుట వలన కొంత మంది వీటిని ఎక్కువుగా ఇష్టపడుతున్నారు. కాని దీనిలో అధిక కొవ్వు శాతము, సోడియం, చక్కర, లవణము అధికముగా ఉంటుంది. అందువలన చాల మందికి స్థూలకాయ సమస్య పెరిగింది. ఇది అంత తొందరగా కూడా జీర్ణము కాకపోవుట వలన జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా ఇది పూర్తిగా రజ-తమ మైనది కావుట వలన భౌతిక సమశ్యలతో పాటుగా ఆధ్యాత్మిక సమస్యలు కూడా పెరుగుతాయి. కావున హిందూ ధర్మ పద్దతిలో గల ఆహరమునే భుజించి ఆరోగ్యముగా ఉండండి.

కర దర్శనము

ఉదయము నిద్ర నుండి లెగువగానే రెండు చేతులను బొమ్మలో చూపిన మాదిరిగా దోసిలిగా పెట్టి, మనస్సుని ఏకాగ్రతతో ఆ చేతి వంక చూస్తూ, కర దర్శనమును చేసుకొంటారు. అప్పుడు ఈ శ్లోకమును చదువుతారు.
కరాగ్రే వసతే లక్ష్మీ: కర మధ్యే సరస్వతీ l
కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ll

అర్థము : చేతికి అగ్రభాగమున లక్ష్మీదేవి నివాసము ఉంటుంది. మధ్యభాగమున సరస్వతి దేవి ఉంటారు , మూల భాగమున గోవిందుడు ఉంటారు ; కావున ఉదయము నిద్ర నుండీ మేల్కొనగానే చేతిని దర్శించుకోనవలెను.

శ్రీ రాముని ఆదర్శమురామ రాజ్యములో అందరు సుఖముగా ఉండేవారు: కానీ ప్రస్తుతము ప్రజాస్వామ్యము అనే రావణ పాలనలో అందరు దుఃఖములో ఉన్నారు. సంతోషముగా అందరు ఉండాలంటే ప్రస్తుత రాక్షస పాలన చేస్తున్న దేశ విద్రోవులను ప్రారదోలి రామ రాజ్యమును స్థాపించాలి. ఇది సాధించడానికి, ఆధ్యాత్మిక సాధన మరియు భక్తీ చేయవలసిన అవసరము ఎంత అయిన ఉంది.ఆదర్శ పుత్రుడు : తల్లిదండ్రుల మాటలను తుచ తప్పకుండ పాటించారు;
ఆదర్శ సోదరుడు : రామ-లక్ష్మణుల ప్రేమను ఇప్పడికి ఆదర్శముగా తీసుకొంటారు.
ఆదర్శ భర్త : ఒక్కే ఒక్క భార్యకు కట్టుబడి ఉన్నారు. రాజులకు అంటే చాల మంది భార్యలు ఉండేవారు.
ఆదర్శ మిత్రుడు : క్లిష్ట పరిస్తుతుల్లో ఉన్న సుగ్రీవుడు, విభీషునుడు మరియు చాల మంది స్నేహితులకు అయన సహాయము చేసారు.
ఆదర్శ రాజు : వేదములలో చెప్పిన రాజుకి కావాల్సిన గుణాలను అన్నింటినీ ఆయన అనుసరించారు.
ఆదర్శ శత్రువు : విభీషునుడు తన సోదరుడు అయిన రావణుడికి అంత్య సంస్కారాలను చెయ్యడానికి తిరస్కరించినప్పుడు, ‘’నువ్వు చేయకపొతే, నేను చేస్తాను. అతను నాకు కూడా సోదరుడే’’ అని పలికారు.
మర్యాద పురుషోత్తముడు : వారు ధర్మమునకు అనుగుణముగా ప్రాతినిధ్యము వహించారు.

దేవునికి గంధమును ఎందుకు పెడతారు?ఎప్పుడైతే మనము గంధమును దేవుని నుదిటి యందు పెడతామో, ఆ గంధములో గల సువాసన, రంగు, దేని నుండి ఆ గంధము తయారు అయ్యిందో, దాని వలన అ దేవుని సూర్య నాడి జాగృతమవుతుంది. అదే సమయములో ఆ దేవుని తత్త్వము ఆ విగ్రహములో ఆకర్శించబడుతుంది. దీని పర్యవసానముగా ఆ విగ్రహము దైవీ చైతన్యముతో నిండిపోతుంది. అన్నింటిలోకల్ల అష్ట గంధము, చందనము సత్త్వ ప్రధానమైనవి.