Wednesday 24 April 2013

నెయ్యి ప్రాముఖ్యత

హోమము నుండి ఎలాంటి శక్తి లభిస్తుందో, అలాంటి శక్తియే సాత్త్వికమైన ఆహారమును భుజించుట వలన లభిస్తుంది. సాత్త్వికమైన ఆహారమును భుజించుట వలన వెలువడే సాత్త్వికమైన లహరులు, నాభి వద్దన గల అయిదు ప్రాణాధార శక్తులను ఉత్తేజింపచేస్తాయి. ఇవి శరీరము అంతటా ప్రవహిస్తాయి. అందుకనే సాత్త్వికమైన ఆహారమును ''పరబ్రహ్మ'' అని అన్నారు.
అతి సాత్త్వికమైన శాఖాహార పదార్ధములలోఆవు నెయ్యి ఒకటి. ఆవు నెయ్యిలో విష్ణు తత్త్వము అధికముగా ఉంటుంది. గేదె నెయ్యి మనిషిలో స్థూలకాయమును పెంచినట్లుగా ఆవు నెయ్యి పెంచదు. ఆవు నెయ్యిలో దైవీ తత్త్వము, శక్తి మరియు చైతన్యము అధికముగా ఉంటుంది. అందువలన దాని మీద చెడు శక్తులు దాడి చెయ్యలేవు.
క్రింద ఇచ్చిన బొమ్మ, నెయ్యిని సూక్ష్మ పరీక్ష చెయ్యగా గీసినది..

 నెయ్యి సూక్ష్మ చిత్రం


1. దైవీ తత్త్వము ఆకర్షితమగుట
2. చైతన్యము ఆకర్శితమగుట
1a. దైవీ తత్త్వ వలయము నిర్మితము అయ్యి కార్యగతము అగుట
2a. దైవీ చైతన్య వలయము నిర్మితము అయ్యి కార్యగతము అగుట
2b. నెయ్యిలో చిన్న చైతన్య కణములు నిర్మితమగుట
2c. నెయ్యి చుట్టూ చైతన్య కవచ వలయము నిర్మాణము అగుట
3. శ్రీ. ధన్వంతరి దైవీ శక్తి కార్యగతము అగుట
3a. దైవీ శక్తి కణములు నిర్మితము అయ్యి నేయ్యిలోవ్యాపించుట

No comments:

Post a Comment