Monday, 26 May 2014

'మానవుడు శాఖహారమును భుజిస్తే' ధర్మమును పాటిస్తున్నట్లుగా ఎలా చెబుతాము ?
'శాఖాహారము మనుష్యుడిని సత్త్వ గుణిగా మారుస్తుంది. మానవ జన్మను సార్థకము చేసే సత్త్వ గుణ ఆహారమును భుజించడము అంటే ధర్మ పాలన చేస్తున్నట్లు. ధర్మ పాలన అంటే యోగ్య ఆహార సంహితను స్వీకరించి, దాని అనుసారముగా ఆచరిస్తూ ధర్మమును, దాని పరిణామముగా భగవంతుడిని ఇష్ట పడటము. శాఖాహారము వలన దేహములోని తమో గుణము లయము అవుతుంది. నరుడిని నారాయణుడిగా మార్చే కార్యమును శాఖాహారము చేయగలదు, కావున ధర్మ పాలన చేసినట్లు అవుతుంది.
- ఒక్క విద్వాంసుడు (సౌ. అంజలి గాడ్గిల్ గారికి లభించిన జ్ఞానము)

Thursday, 22 May 2014

మహాభారతమును ‘ధర్మ యుద్ధము’ అని ఎందుకు అంటారు ?


మహాభారతములోని మొదటి మూడు రోజులలో అనేక కౌరవ బంధువులు మరియు వీరులు పాండవుల చేతిలో మరణించారు. పాండవుల పక్షములో ఏ ప్రముఖ సేనాని మృత్యువు కూడా అప్పటి వరకు అవ్వలేదు. అప్పుడు దుర్యోధనునికి కోపము వచ్చి, భీష్ముడిని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ‘రేపు 5 బాణాలతో అయిదుగురు పాండవులను చంపుతాను’ అని అంటారు. అప్పుడు దుర్యోధనుడు ‘ఏ అయిదు బాణాల చేత చంపదలుచుకోన్నారో, ఆ బాణాలు నాకు ఇవ్వండి. ఉదయమే నేను తెచ్చి ఇస్తానని’ అంటాడు. అప్పుడు భీష్ముడు అయిదు బాణాలను మంత్రించి దుర్యోధనుడికి ఇస్తాడు.
 
ఈ విషయము శ్రీ కృష్ణ భగవానునికి తెలిసిపోతుంది. అప్పుడు అయన ఒక ఉపాయము చెబుతారు. పాండవులు వనవాసములో ఉన్నప్పుడు, దుర్యోధనుడు ఒక్కసారి అరణ్యమునకు వెళ్ళతాడు. ఆ సమయములో అర్జునుడు అతని ప్రాణాలను రక్షిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఏదైనా వరమును కోరమన్నప్పుడు, ‘అవసరము వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడు తప్పక తీర్చమని’ అర్జునుడు చెబుతాడు.
శ్రీ కృష్ణుడు అర్జునుడి యుద్ధ శిబరమునకు వెళ్లి ఆ అయిదు బాణాలను దుర్యోధనుడిని అడిగి తీసుకు రమ్మంటాడు. అర్జునుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి ఆ అయిదు బాణాలను అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు తాను ఇచ్చిన మాట అనుసారముగా ఆ అయిదు బాణాలను అర్జునుడికి ఇచ్చేస్తాడు; అందుకే ఈ యుద్దమును ‘ధర్మ యుద్ధము’ అని అంటారు.

Tuesday, 6 May 2014

గంగా నది ఆధ్యాత్మిక వైశిష్ట్యము

జ్ఞానం మహేశ్వజరాత్ ఇచ్చేత్ మోక్షం ఇచ్చేత్ జనార్ధనాత్ l , అనగా శివుని వద్ద జ్ఞానము మరియు విష్ణువు వద్ద మోక్షమును కోరవలెను.శంకరుడు జ్ఞానమయుడు అగుట వలన శివుని జట నుంచి ప్రవహించే గంగా నది కూడా సరస్వతి నది మాదిరిగా జ్ఞాన దాయకము అయినది  - ప.పూ. డా. ఆఠవలె

 

గంగా నది దశాహరము. అది శారీరిక, వాచిక, మానసికలను కల దశ పాపములను హరిస్తుంది అనగా నాశనము చేస్తుంది.
శారీరిక పాపములు : - ౧. దొంగతనము, ౨. హింస, ౩. పరస్త్రీ గమనము 
వాచిక పాపములు :- ౧. అబద్ధములు చెప్పుట, ౨. కఠోరముగా మాట్లాడుట, ౩. నిందించుట, ౪. అసంబద్దముగా, ఆకారణముగా మాట్లాడుట 
మానసిక పాపములు :- ౧. ఇతరుల ధనమును దొంగాలిద్దమనే ఆలోచన వచ్చుట, ౨. ఇతరుల గురించి చెడుగా ఆలోచించుట మరియు ౩. దురగ్రహము 
- గురుదేవులు డా. కాటేస్వామిజి