Tuesday, 30 April 2013

పూజ గదిలో దేవి-దేవతలను ఎలా అమర్చవలెను?


ఎవరి ఇంట్లో అయితే పూజ గది లేదో, లేదా దేవత ఫోటోలు లేవో, లేదా విగ్రహాలు లేవో, లేదా ఇలవేల్పు దేవత ఫోటోలు లేవో, వారు వెంటనే పూజ గదిని ఇంటిలో అమర్చవలెను. పూజ గదిలో దేవి-దేవతలను ఈ విధముగా అమర్చవలెను.
గణపతి దేవుని విగ్రహము లేదా చిత్రము మధ్యలో ఉండవలెను. పురుష దేవతలు గణపతికి కుడి వైపున (ఉదా: హనుమంతుడు, శ్రీ కృష్ణుడు) మరియు స్త్రీ దేవతలు(ఉదా : అన్నపూర్ణ దేవి) గణపతికి ఎడమ వైపున వచ్చే విధముగా అమర్చవలెను. కొన్ని ఫోటోలలో ఆడ దేవతలతో పాటుగా మగ దేవతలు కూడా కలిసిన ఫోటోలు (ఉదా : సీతారాముడు, లక్ష్మి నారాయణుడు)వుంటాయి. అలాంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధముగా పెట్టవలెను. ఎవ్వరికైనా ఆధ్యాత్మిక గురువు ఉండి, కేవలము ఒక్కరే నివశిస్తుంటే  అతను కేవలము గురువుల ఫోటోను మాత్రమే పెట్టవలెను. ఒక్కవేల కుటుంబ సభ్యులు వుంటే గురువుల ఫోటోను గణపతి దేవునికి కుడి వైపున వచ్చే విధముగా పెట్టవలెను. ఎవ్వరైతే పూజను చెయ్యలేకపోతారో, వారు క్రింద చెప్పిన విధముగా చెయ్యాలి :
ప్రతి రోజు దేవి-దేవత చిత్రములను గుడ్డతో తుడవాలి. రెండు ఉదబత్తిలను ఉదయము మరియు సాయంత్రము వెలిగించవలెను.
ముందు రోజు పెట్టిన పువ్వులను తీసివేయ్యాలి. ఉదబత్తిలను వెలిగించిన తరువాత సవ్య దిశలో(గడియారపు ముళ్ళు తిరిగే దిశ) త్రిప్పవలెను. నెయ్యి దీపమును వెలిగించిన తరువాత ఆరతి చేస్తున్నప్పుడు సవ్య దిశలో దీపమును త్రిప్పవలెను.
విగ్రహములను లేదా చిత్ర పటములను మొదట తడి గుడ్డతో తరువాత పొడి గుడ్డతో తుడవవలెను. గంధమును పెట్టవలెను. తరువాత అక్షింతలు, పువ్వులు, పసుపు మరియు కుంకుమను సమర్పించవలెను. దాని తరువాత ఉదబత్తిలను వెలిగించి, దీపముతో హారతిని ఇవ్వవలెను. చివరగా, నైవేద్యమును చూపించవలెను.

Saturday, 27 April 2013

అన్నమును ''పరబ్రహ్మ'' అని ఎందుకు అంటారు?

हे न जाणावे साधारण ।
अन्‍न ब्रह्मरूप जाण ।
जे जीवनहेतु कारण ।
विश्‍वा यया ।। - श्री भावार्थदीपिका (श्री ज्ञानेश्‍वरी ३:३३)

 సంతు జ్ఞానేశ్వర్ గారు చెప్పిన విధముగా ''పూర్తీ విశ్వమంత బ్రహ్మలోనే పుట్టి, పెరిగి, అందులోనే లయము అవుతుంది. అదే విధముగా అన్ని జీవరాశులు అన్నముతోనే పుట్టి, పెరిగి, అందులోనే లయము అవుతాయి. అందుకనే అన్నమును ''పరబ్రహ్మ''తో పోలుస్తారు.

ఎవ్వరికైనా భోజనమును వడ్డించేటప్పుడు ఎలా వడ్డించాలి? క్రింద ఇచ్చిన బొమ్మను చూడండి.అన్నము, చపాతీ, కూర అనేవి ప్లేటుకి మధ్యలో వడ్డించాలి. ప్లేటుకి కుడి వైపున (అనగ తినే వ్యక్తికీ ఎడమ వైపున)పళ్ళు, డ్రై fruits మొదలుగునవి వడ్డించాలి. ప్లేటుకి ఎడమ వైపున ద్రవ పదార్థాలను(మజ్జిగ, పప్పు మొదలుగునవి) వడ్డించాలి. పచ్చడి, ఉప్పు మొదలైనవి అన్నమునకు ముందు  ఎడమ వైపున వడ్డించాలి.

అన్నమును ఎప్పుడు తినాలి?
పిల్లలు మూత్రము పోసినప్పుడు, మల విసర్జన చేసినప్పుడు వాళ్ళకు ఆకలి వేస్తుంది. అనగా వాళ్ళకి ఆకలి వేస్తుందనే దానికి ఇది సంకేతము. పెద్దలు అయితే భోజనము చేసిన మూడు గంటలు వరకు ఏమి తినరాదు. అర్థ రాత్రి గాని, తెల్లవారే గాని ఏమి తినకూడదు. కాని యువకులు, పెరుగుతున్న పిల్లలు మాత్రమూ ఎప్పుడు అయిన తినవచ్చు. వాళ్ళకి ఆకలి వేస్తె తినవచ్చు.
అన్నమును తినే ముందు కాళ్ళు, చేతులు, నోరు బాగా కడుక్కోవాలి. అన్నమునకు ప్రార్థన చేసిన తరువాతనే భుజించాలి (దీనికి సంబందించిన విషయము త్వరలో ఇవ్వబడును). అన్నమును తింటున్నప్పుడు టీవీ చూడటము, ఎక్కువగా మాట్లాడటము చెయ్యకూడదు. అన్నమును మరీ  స్పీడుగా కాని, మరీ  నెమ్మదిగా కాని తినకూడదు. ఎక్కువగా నవ్వడము కానీ చెయ్యకూడదు.
కొందరు ఈ మధ్యన పిజ్జాలకు, బర్గర్లకు బాగా అలవాటుపడ్డారు. అవి ఏ మాత్రమూ మన ఆరోగ్యానికి మంచివి కావు. శీతల పానీయాలను (అనగా కోక్, sprite) త్రాగకూడదు. కొందరు భోజనమును చేస్తున్నప్పుడు అల్కోహలుని త్రాగుతారు. అలా త్రాగడము ఆరోగ్యానికి చాల హానికరము.
స్థూలకాయ వ్యక్తీ అన్నమును భుజించే ముందు ఎక్కవు నీళ్ళు త్రాగాలి. సన్న వ్యక్తీ భోజనము తరువాత నీళ్ళు ఎక్కవ త్రాగాలి. భోజనము చేస్తున్నప్పుడు ఒక్క కూర నుండి తరువాత కూరకి మారుతున్నప్పుడు ఆ కూర రుచి కోసము కొంచెము నీటిని సిప్ చెయ్యవచ్చును...అధిక వివరములకు http://www.hindujagruti.org/hinduism/knowledge/article/why-is-food-itself-called-as-brahma.html చదవండి.


Friday, 26 April 2013

శ్రీ ఈశ్వర్ సింగ్ ఠాకూర్ గారి ప్రసంగము

హిందూ జన జాగృతి సమితి తరపు నుండి ఆదిలాబాద్లో జరిగిన హిందూ ధర్మ జాగృతి సభలో శ్రీ. ఈశ్వర్ సింగ్ ఠాకూర్ గారు ప్రసంగిచారు..వారు ఏమన్నారో మీరే చుడండి..
http://www.youtube.com/watch?v=-BxHbvWUGms

Wednesday, 24 April 2013

నెయ్యి ప్రాముఖ్యత

హోమము నుండి ఎలాంటి శక్తి లభిస్తుందో, అలాంటి శక్తియే సాత్త్వికమైన ఆహారమును భుజించుట వలన లభిస్తుంది. సాత్త్వికమైన ఆహారమును భుజించుట వలన వెలువడే సాత్త్వికమైన లహరులు, నాభి వద్దన గల అయిదు ప్రాణాధార శక్తులను ఉత్తేజింపచేస్తాయి. ఇవి శరీరము అంతటా ప్రవహిస్తాయి. అందుకనే సాత్త్వికమైన ఆహారమును ''పరబ్రహ్మ'' అని అన్నారు.
అతి సాత్త్వికమైన శాఖాహార పదార్ధములలోఆవు నెయ్యి ఒకటి. ఆవు నెయ్యిలో విష్ణు తత్త్వము అధికముగా ఉంటుంది. గేదె నెయ్యి మనిషిలో స్థూలకాయమును పెంచినట్లుగా ఆవు నెయ్యి పెంచదు. ఆవు నెయ్యిలో దైవీ తత్త్వము, శక్తి మరియు చైతన్యము అధికముగా ఉంటుంది. అందువలన దాని మీద చెడు శక్తులు దాడి చెయ్యలేవు.
క్రింద ఇచ్చిన బొమ్మ, నెయ్యిని సూక్ష్మ పరీక్ష చెయ్యగా గీసినది..

 నెయ్యి సూక్ష్మ చిత్రం


1. దైవీ తత్త్వము ఆకర్షితమగుట
2. చైతన్యము ఆకర్శితమగుట
1a. దైవీ తత్త్వ వలయము నిర్మితము అయ్యి కార్యగతము అగుట
2a. దైవీ చైతన్య వలయము నిర్మితము అయ్యి కార్యగతము అగుట
2b. నెయ్యిలో చిన్న చైతన్య కణములు నిర్మితమగుట
2c. నెయ్యి చుట్టూ చైతన్య కవచ వలయము నిర్మాణము అగుట
3. శ్రీ. ధన్వంతరి దైవీ శక్తి కార్యగతము అగుట
3a. దైవీ శక్తి కణములు నిర్మితము అయ్యి నేయ్యిలోవ్యాపించుట

Monday, 22 April 2013

అరటి పండు వైశిష్ట్యము

అన్ని పండ్లలో కూడా అరటి పండు చాల సాత్వికమైనది..కొందరు సాధకులు, వారు చేసే సాధన వలన సూక్ష్మముగా చాల విషయాలు తెలుసుకొంటారు..వారిలో ఆరవ ఇంద్రియము జాగృతము అయ్యి ఉంటుంది..అయితే వారు అరటి పండుని గమనించినప్పుడు చిత్రములో చూపిన విధముగా కొన్ని మన కంటికి కనపడని తరంగాలు కనిపించాయి..చిత్రమును గమనిస్తూ పై నుంచి క్రిందకు చదివితే...
1. సూక్ష్మముగా సుగంధము వెలువడుట
2. దైవీ శక్తి (ఎరుపు రంగు)
3. సాత్వికత (పసుపు రంగు కణాలు)
4. చైతన్యము


గోముత్రము యొక్క ఉపయోగము

గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు అని అంటారు..గోవు నుంచి లభ్యమయ్యే ప్రతి పదార్థము పవిత్రమినదే..వీటిలో గోమూత్రము చాల పవిత్రమైనది..ఇంటికీ శంకు స్థాపన చేసే సమయములో గోవును తెచ్చి అక్కడ మూత్రము పోయించేవారు..గోమూత్రమును ఇంటిలో చల్లితే ఇల్లు పవిత్రము, వాస్తు శుద్ధి అవ్వడమే కాకుండా ఎటువంటి చెడు శక్తులు ఇంటిలో చేరవని నమ్ముతారు..అలాగునే కొన్ని గోమూత్రము చుక్కలను మనము స్నానము చేసే నీటిలో పోసి స్నానము చేస్తే మన శరీర శుద్ధి కూడా అవుతుంది..క్రింద ఇచ్చిన బొమ్మలో వివిధ రంగుల వలయాలు, రేఖలు ఇవ్వబడ్డాయి..ఫ్రాన్స్ కి చెందిన యోయ వాలే అనే ఆమె ఈ చిత్రమును తన sixth sense ద్వార చూసి గీసినది...

కుంకుమ పెట్టుకోవడము వలన కలిగే లాభాలు ఏమిటి?

ఈ మధ్యన ఆడవాళ్ళు కుంకుమ పెట్టుకోకపోవడము పెద్ద fashion గ అయ్యింది. కుంకుమ అనేది పసుపు నుండి తయారవుతుంది. పసుపు లో పృథ్వీ తత్వము ఉంటుంది. ఆడవారు నుదిటి మధ్యలో గుండ్రముగా మరియు మగవారు నిలువుగా బొట్టుని ధరించాలి. అక్కడ అజ్ఞా చక్రము ఉంటుంది. ఎప్పుడైతే మనము కుంకుమను పెట్టుకొంటామో అప్పుడు మగవారిలో శివ తత్వము మరియు ఆడవారిలో దైవీ తత్త్వము జాగృతము అయ్యి మనకు వాతావరణములో గల దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది...అందుకని ఆడవాళ్ళూ బొట్టు బిళ్ళలు బదులుగా కుంకుమను ధరించండి..
ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి....తప్పకుండ కుంకుమను ధరించండి...


దేవుని దర్శనము ఎలా చేసుకోవాలి?


దత్త నామజప ఉపయోగము


హనుమాన్ జయంతిచైత్ర మాసములోని పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకొంటారు.  కొన్ని పంచంగాముల ప్రకారము అశ్విని మాసములోని చతుర్ధశి నావు హనుమాన్ జయంతి అని, కొన్ని పంచంగాముల ప్రకారము చైత్ర మసములోని పౌర్ణమి నాడు అని చెప్పడము జరుగుతుంది. ఈ సంవత్సరము మార్చి 25వ తేదీన హనుమాన్ జయంతి వచ్చినది. హనుమంతుడు సూర్యోదయం నాడు జన్మించారు. ఆ సమయములో అందరికి కూడా ప్రసాదము పంచడము జరుగుతుంది.
పూజను చేసేటప్పుడు ఉంగరము వేలుతో సింధూరమును పెట్టవలెను. జిల్లేడు ఆకులను కానీ, పువ్వులను కానీ సమర్పించవలెను. వీటిని అయిదు సంఖ్యలో లేదా అయిదు గుణంకితములలో(5, 10, 15...ఇలా) అర్పించవలెను. రెండు ఊదబత్తిలను వెలిగించి, కుడిచేతి యొక్క బొటన వేలు మరియు చూపుడు వేలుతో పట్టుకొని మూడు సార్లు వృత్తాకారములో తిప్పవలెను.
హనుమంతునికి అయిదు లేదా అయిదు గుణాంకములలో ప్రదిక్షణను చెయ్యాలి.