Saturday 27 April 2013

అన్నమును ''పరబ్రహ్మ'' అని ఎందుకు అంటారు?

हे न जाणावे साधारण ।
अन्‍न ब्रह्मरूप जाण ।
जे जीवनहेतु कारण ।
विश्‍वा यया ।। - श्री भावार्थदीपिका (श्री ज्ञानेश्‍वरी ३:३३)

 సంతు జ్ఞానేశ్వర్ గారు చెప్పిన విధముగా ''పూర్తీ విశ్వమంత బ్రహ్మలోనే పుట్టి, పెరిగి, అందులోనే లయము అవుతుంది. అదే విధముగా అన్ని జీవరాశులు అన్నముతోనే పుట్టి, పెరిగి, అందులోనే లయము అవుతాయి. అందుకనే అన్నమును ''పరబ్రహ్మ''తో పోలుస్తారు.

ఎవ్వరికైనా భోజనమును వడ్డించేటప్పుడు ఎలా వడ్డించాలి? క్రింద ఇచ్చిన బొమ్మను చూడండి.



అన్నము, చపాతీ, కూర అనేవి ప్లేటుకి మధ్యలో వడ్డించాలి. ప్లేటుకి కుడి వైపున (అనగ తినే వ్యక్తికీ ఎడమ వైపున)పళ్ళు, డ్రై fruits మొదలుగునవి వడ్డించాలి. ప్లేటుకి ఎడమ వైపున ద్రవ పదార్థాలను(మజ్జిగ, పప్పు మొదలుగునవి) వడ్డించాలి. పచ్చడి, ఉప్పు మొదలైనవి అన్నమునకు ముందు  ఎడమ వైపున వడ్డించాలి.

అన్నమును ఎప్పుడు తినాలి?
పిల్లలు మూత్రము పోసినప్పుడు, మల విసర్జన చేసినప్పుడు వాళ్ళకు ఆకలి వేస్తుంది. అనగా వాళ్ళకి ఆకలి వేస్తుందనే దానికి ఇది సంకేతము. పెద్దలు అయితే భోజనము చేసిన మూడు గంటలు వరకు ఏమి తినరాదు. అర్థ రాత్రి గాని, తెల్లవారే గాని ఏమి తినకూడదు. కాని యువకులు, పెరుగుతున్న పిల్లలు మాత్రమూ ఎప్పుడు అయిన తినవచ్చు. వాళ్ళకి ఆకలి వేస్తె తినవచ్చు.
అన్నమును తినే ముందు కాళ్ళు, చేతులు, నోరు బాగా కడుక్కోవాలి. అన్నమునకు ప్రార్థన చేసిన తరువాతనే భుజించాలి (దీనికి సంబందించిన విషయము త్వరలో ఇవ్వబడును). అన్నమును తింటున్నప్పుడు టీవీ చూడటము, ఎక్కువగా మాట్లాడటము చెయ్యకూడదు. అన్నమును మరీ  స్పీడుగా కాని, మరీ  నెమ్మదిగా కాని తినకూడదు. ఎక్కువగా నవ్వడము కానీ చెయ్యకూడదు.
కొందరు ఈ మధ్యన పిజ్జాలకు, బర్గర్లకు బాగా అలవాటుపడ్డారు. అవి ఏ మాత్రమూ మన ఆరోగ్యానికి మంచివి కావు. శీతల పానీయాలను (అనగా కోక్, sprite) త్రాగకూడదు. కొందరు భోజనమును చేస్తున్నప్పుడు అల్కోహలుని త్రాగుతారు. అలా త్రాగడము ఆరోగ్యానికి చాల హానికరము.
స్థూలకాయ వ్యక్తీ అన్నమును భుజించే ముందు ఎక్కవు నీళ్ళు త్రాగాలి. సన్న వ్యక్తీ భోజనము తరువాత నీళ్ళు ఎక్కవ త్రాగాలి. భోజనము చేస్తున్నప్పుడు ఒక్క కూర నుండి తరువాత కూరకి మారుతున్నప్పుడు ఆ కూర రుచి కోసము కొంచెము నీటిని సిప్ చెయ్యవచ్చును...అధిక వివరములకు http://www.hindujagruti.org/hinduism/knowledge/article/why-is-food-itself-called-as-brahma.html చదవండి.


No comments:

Post a Comment