Monday, 26 May 2014

'మానవుడు శాఖహారమును భుజిస్తే' ధర్మమును పాటిస్తున్నట్లుగా ఎలా చెబుతాము ?




'శాఖాహారము మనుష్యుడిని సత్త్వ గుణిగా మారుస్తుంది. మానవ జన్మను సార్థకము చేసే సత్త్వ గుణ ఆహారమును భుజించడము అంటే ధర్మ పాలన చేస్తున్నట్లు. ధర్మ పాలన అంటే యోగ్య ఆహార సంహితను స్వీకరించి, దాని అనుసారముగా ఆచరిస్తూ ధర్మమును, దాని పరిణామముగా భగవంతుడిని ఇష్ట పడటము. శాఖాహారము వలన దేహములోని తమో గుణము లయము అవుతుంది. నరుడిని నారాయణుడిగా మార్చే కార్యమును శాఖాహారము చేయగలదు, కావున ధర్మ పాలన చేసినట్లు అవుతుంది.
- ఒక్క విద్వాంసుడు (సౌ. అంజలి గాడ్గిల్ గారికి లభించిన జ్ఞానము)

Thursday, 22 May 2014

మహాభారతమును ‘ధర్మ యుద్ధము’ అని ఎందుకు అంటారు ?


మహాభారతములోని మొదటి మూడు రోజులలో అనేక కౌరవ బంధువులు మరియు వీరులు పాండవుల చేతిలో మరణించారు. పాండవుల పక్షములో ఏ ప్రముఖ సేనాని మృత్యువు కూడా అప్పటి వరకు అవ్వలేదు. అప్పుడు దుర్యోధనునికి కోపము వచ్చి, భీష్ముడిని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ‘రేపు 5 బాణాలతో అయిదుగురు పాండవులను చంపుతాను’ అని అంటారు. అప్పుడు దుర్యోధనుడు ‘ఏ అయిదు బాణాల చేత చంపదలుచుకోన్నారో, ఆ బాణాలు నాకు ఇవ్వండి. ఉదయమే నేను తెచ్చి ఇస్తానని’ అంటాడు. అప్పుడు భీష్ముడు అయిదు బాణాలను మంత్రించి దుర్యోధనుడికి ఇస్తాడు.
 
ఈ విషయము శ్రీ కృష్ణ భగవానునికి తెలిసిపోతుంది. అప్పుడు అయన ఒక ఉపాయము చెబుతారు. పాండవులు వనవాసములో ఉన్నప్పుడు, దుర్యోధనుడు ఒక్కసారి అరణ్యమునకు వెళ్ళతాడు. ఆ సమయములో అర్జునుడు అతని ప్రాణాలను రక్షిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఏదైనా వరమును కోరమన్నప్పుడు, ‘అవసరము వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడు తప్పక తీర్చమని’ అర్జునుడు చెబుతాడు.
శ్రీ కృష్ణుడు అర్జునుడి యుద్ధ శిబరమునకు వెళ్లి ఆ అయిదు బాణాలను దుర్యోధనుడిని అడిగి తీసుకు రమ్మంటాడు. అర్జునుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి ఆ అయిదు బాణాలను అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు తాను ఇచ్చిన మాట అనుసారముగా ఆ అయిదు బాణాలను అర్జునుడికి ఇచ్చేస్తాడు; అందుకే ఈ యుద్దమును ‘ధర్మ యుద్ధము’ అని అంటారు.

Tuesday, 6 May 2014

గంగా నది ఆధ్యాత్మిక వైశిష్ట్యము

జ్ఞానం మహేశ్వజరాత్ ఇచ్చేత్ మోక్షం ఇచ్చేత్ జనార్ధనాత్ l , అనగా శివుని వద్ద జ్ఞానము మరియు విష్ణువు వద్ద మోక్షమును కోరవలెను.శంకరుడు జ్ఞానమయుడు అగుట వలన శివుని జట నుంచి ప్రవహించే గంగా నది కూడా సరస్వతి నది మాదిరిగా జ్ఞాన దాయకము అయినది  - ప.పూ. డా. ఆఠవలె

 

గంగా నది దశాహరము. అది శారీరిక, వాచిక, మానసికలను కల దశ పాపములను హరిస్తుంది అనగా నాశనము చేస్తుంది.
శారీరిక పాపములు : - ౧. దొంగతనము, ౨. హింస, ౩. పరస్త్రీ గమనము 
వాచిక పాపములు :- ౧. అబద్ధములు చెప్పుట, ౨. కఠోరముగా మాట్లాడుట, ౩. నిందించుట, ౪. అసంబద్దముగా, ఆకారణముగా మాట్లాడుట 
మానసిక పాపములు :- ౧. ఇతరుల ధనమును దొంగాలిద్దమనే ఆలోచన వచ్చుట, ౨. ఇతరుల గురించి చెడుగా ఆలోచించుట మరియు ౩. దురగ్రహము 
- గురుదేవులు డా. కాటేస్వామిజి

Monday, 28 April 2014

ఉగాది పండుగ


బ్రహ్మదేవుడు ఏరోజైతే ఈ సృష్టిని నిర్మించినారో ఆ రోజునే ఉగాదిని జరుపుకొంటాము.. ఉగాది అనే పదము ‘యుగాది’ నుండి నిర్మితమైనది. ‘యుగాది’ అనగా యుగము ఆరంభము అయిన రోజు.
‘ఉగాది’ ని మరాఠీ లో 'గుడిపాడ్వ' అని అంటారు. ఐతే ఈ పేరు ఎలా వచ్చిందో మరియు ఆ పేరుతోనే ఎందుకు పిలుస్తారో ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం.
పాడవ లో 'పాడ్'అనగా సంపూర్ణము లేదా పరిపక్వము చెందినది .ఉదాహరణకు మామిడికాయ పక్వానికి వచ్చే పూర్వపు అవస్థను మరాఠీ లో ‘పాడ్’(పక్వానికి వచ్చిన మామిడి ) అంటారు . మామిడికాయ పక్వానికి వచ్చ్హాక దాన్ని చెట్టు మిద ఉంచవలసిన అవసరం లేదు దాన్ని తెంపి మెరుగైన పరిస్థితులు అందిస్తే అది తీయగా రుచికరమైన పండు గా తయారవుతుంది .దిని ద్వారా తెలిసినదేమి అనగా పక్వానికి వచ్చిన (పాడ్ )వచ్చిన మామిడికాయ పండు అవడానికి సిద్దంగా వుంటుంది దానికి చెట్టు మీదనే వుంచాల్సిన అవసరం లేదు .అది చెట్టు మీదనుండి తెంపిన తర్వాత కూడా పక్వించి రుచికరమైన పచ్చని పండుగా మారుతుంది.
పాడవా శభ్ధం లోని పాడ్ అంటే తెలుసుకున్నాం ఇప్పుడు 'వా' అర్థం చూద్దాము 'వా' అనగా ఆద్యాత్మిక శాస్త్రము లో వృద్ధి అని అర్థము.’పాడ్’ మరియు ‘వా’ శభ్డాలు కలిసి 'పాడ్వా'(ఉగాది) అవుతుంది.పాడ్ అనగా సంపూర్ణమైన మరియు వా అనగా వృద్ధి.అనగా సంపూర్ణత్వము లో ఇంకా వృద్ది జరిగి అది పరిపూర్ణమవుతుంది.
పాడ్వా శభ్దము ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. బ్రహ్మ దేవుడు సృష్టిని సాకారంగా చిత్రీకరించాడు అనగా 'పాడ్'(సంపుర్ణ ము)లో ఉత్పత్తి మార్పులు చేర్పులు చేస్తూ చేస్తూ అది ఇంకా చాలా అందంగా తయారవుతూ పరిపూర్ణతను సంతరించుకుంది.బ్రహ్మదేవుడు సృష్టి యొక్క పరిపూర్ణచిత్రమును సాకారము చేసిన రోజే గుడిపాడ్వా(ఉగాది) మరియు ఆ రోజు ధ్వజం (గుడి)ని నిలబెట్టడం పద్దతిగా మారింది. అందుకే ఈరోజును మరాఠీ లో 'గుడిపాడ్వా' (ఉగాది) అంటారు..
ఈ రోజు బ్రహ్మాండములో ప్రజాపతి తరంగములు అధికముగా పృథ్వీ మీదకు వస్తాయి. అందువలన వాటిని సంగ్రహించేందుకు ఈ ప్రార్థనను చెయ్యండి.
ఉగాది రోజు చేయించే ప్రార్థన ;
ఓ భగవంతుడా ! ఈ రోజు నీ నుండి లభించే శుభాశిర్వాదములు మరియు బ్రహ్మాండం నుండి వచ్చే సాత్విక తరంగాలు నాకు అధికంగా గ్రహించగలిగెట్టు చేయి .ఈ తరంగాలు గ్రహించే అర్హత నాకు లేదు .నేను నీకు సంపుర్ణ శరణాగతికి వచ్చాను.నువ్వు నాకు ఈ సాత్విక తరంగాలు ఎలా గ్రహించాలో నేర్పించు.ఇదే నీ చరణాల వద్ద నా ప్రార్థన ..

సాత్త్విక ద్రవ్యములను మాత్రమే తీసుకొనండి


సత్త్వ, రజ, తమ అని మూడు గుణాలు వుంటాయి..వీటిలో సాత్వికము మంచి గుణము..అయితే మనము తీసుకొంటున్న ఆహారములో ఏది సాత్త్వికము?? కూల్ డ్రింక్స్ పూర్తిగా తామసికమైనవి...ఈ బొమ్మలో ఎడమ నుంచి కుడి వైపునకు కనుక గమనిస్తే తామసిక పదార్థాల నుండి సాత్విక పదార్థాలుగా చూడవలెను..అనగా కూల్ డ్రింక్స్, టీ, ఆల్కహాల్ అధిక తమసికము..అదే విధముగా పళ్ళ రసాలు, కొబ్బరి నీరు మరియు ఆవు పాలు అధిక సాత్వికమైనవి..ఆవు పాలు అన్నింటికన్నా సాత్వికమైనవి..కాబట్టి మీరు ఎండా కాలములో కూల్ డ్రింక్స్ నకు బదులుగా కొబ్బరి బోండాం నీలు త్రాగండి..

ఆధునిక (పాశ్చాత్య) ఆహారము

ప్రస్తుతము చాల మంది ఇంటిలో తల్లి గని, సోదరి గాని చేసిన ఆహారమును భుజించకుండా బర్గర్, పిజ్జా, చైనీస్ ఫుడ్ మొదలగు ఫాస్ట్ ఫుడ్లకు అలవాటుపడ్డారు. ఈ ఆహారము తినడానికి రుచిగా అయితే ఉంటుంది. ఇవి తయారు చేయ్డానికి కూడా చాల సులభముగా ఉండుట వలన కొంత మంది వీటిని ఎక్కువుగా ఇష్టపడుతున్నారు. కాని దీనిలో అధిక కొవ్వు శాతము, సోడియం, చక్కర, లవణము అధికముగా ఉంటుంది. అందువలన చాల మందికి స్థూలకాయ సమస్య పెరిగింది. ఇది అంత తొందరగా కూడా జీర్ణము కాకపోవుట వలన జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా ఇది పూర్తిగా రజ-తమ మైనది కావుట వలన భౌతిక సమశ్యలతో పాటుగా ఆధ్యాత్మిక సమస్యలు కూడా పెరుగుతాయి. కావున హిందూ ధర్మ పద్దతిలో గల ఆహరమునే భుజించి ఆరోగ్యముగా ఉండండి.

కర దర్శనము

ఉదయము నిద్ర నుండి లెగువగానే రెండు చేతులను బొమ్మలో చూపిన మాదిరిగా దోసిలిగా పెట్టి, మనస్సుని ఏకాగ్రతతో ఆ చేతి వంక చూస్తూ, కర దర్శనమును చేసుకొంటారు. అప్పుడు ఈ శ్లోకమును చదువుతారు.




కరాగ్రే వసతే లక్ష్మీ: కర మధ్యే సరస్వతీ l
కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ll

అర్థము : చేతికి అగ్రభాగమున లక్ష్మీదేవి నివాసము ఉంటుంది. మధ్యభాగమున సరస్వతి దేవి ఉంటారు , మూల భాగమున గోవిందుడు ఉంటారు ; కావున ఉదయము నిద్ర నుండీ మేల్కొనగానే చేతిని దర్శించుకోనవలెను.