Friday, 19 September 2014

నాగ పంచమి

తన తండ్రి పాము కాటు వలన చనిపోవడముతో జన్మేజయ రాజు సర్ప యజ్ఞమును చేస్తారు. అప్పుడు అస్తిక మహర్షి వచ్చి రాజుని శాంతింపజేస్తారు. జన్మజేయుడు వరము కోరమని అడుగగా, సర్పయజ్ఞమును ఆపివేయమని మహర్షి అడుగగానే, జన్మజేయుడు సర్ప యజ్ఞమును అపివేస్తాడు. ఆ రోజే శ్రావణ శుక్ల పక్ష పంచమి..అదే నాగ పంచమి.


శ్రీ కృష్ణుడు ఏ రోజైతే కాల నాగుని యమునా నది వదిలి వెళ్ళమని చెబుతాడో, ఆ రోజే శ్రావణ శుక్ల పక్ష పంచమి..
భగవద్గీతలో తన గురించి వర్ణిస్తూ, శ్రీ కృష్ణుడు ‘‘నాగులలో కల్లా పెద్దది అయిన ‘అనంత’ని కూడా నేనే..’’అని చెబుతారు.
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం I
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం, కాలియం తథా II
తొమ్మిది ప్రకారముల నాగులు – అనంత, వాసుకి, శేషుడు, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక మరియు కాలియ లను పూజిస్తే సర్ప భయము తొలిగిపోతుంది.
ఈ రోజు క్రొత్త బట్టలు వేసుకొంటారు. పసుపుతో తొమ్మిది నాగులను గీసి, వాటికి పూజ చేస్తారు. ఈ రోజున కొయ్యడము, వేయించడము, పొయ్యిని వెలిగించడము చెయ్యరు. తవ్వడము కూడా ఈ రోజు నిషేధమైనది.

వాస్తు శాస్త్రం

వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.
ఇంటిలో వాస్తు మంచిగా ఉండటానికి క్రింది నియమాలను పాటించండి.



౧. స్నానపు గది తలుపు ఎప్పుడూ మూసే వుంచండి. ఎందుకంటే స్నానపు గదిలో రజ-తమ తరంగాలు ఎక్కువుగా వుంటాయి. తలుపు తెరిచి ఉంచటము వలన అవి ఇంటిలో గల సాత్వికతను దెబ్బతీస్తాయి.
౨. అద్దము వైపునకు చెడు శక్తులు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అందువలన నిద్ర గదిలో కాని, ఎక్కువ సమయము గడిపే గదిలో గాని అద్దములను పెట్టకుండా వరండాలో పెట్టుకొనవచ్చును.
౩. కొవ్వుత్తులను సాధ్యమైనంత వరకు వెలిగించవద్దు. ఎందుకంటే కొవ్వత్తులు రజ- తమ తరంగాలను ప్రక్షేపితము చేస్తాయి.
౪. 'సత్యం శివం సుందరం' అంటారు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రముగా ఉంచండి. అందువలన ఇంటిలో భగవంతుని తత్త్వ తరంగాలు వస్తుంటాయి.
5. ఇంటి తలుపులు-కిటికీలను సాధ్యమైనంత వరకు తెరచి ఉంచండి. ఇందువలన భగవంతుని చైతన్యము పంచతత్త్వాల (పృథ్వీ, నీరు, గాలి, నిప్పు(తేజము), ఆకాశము ) మాద్యమముగా ఇంటిలో ప్రవేశిస్తుంది.
౬. ఇంటి చుట్టూ ప్రక్కల సాత్త్విక మొక్కలను పెంచండి. ఉదా :- తులసి, మందార మొదలుగునవి.
౭. ఇంటి ముంగిట తూర్పు-పడమర లలో ఉండటము వలన భగవంతుని కణాలు(సూర్యుని నుండి వచ్చే) ఇంటిలో సులభముగా ప్రసరిస్తాయి.

మహాశివరాత్రిని ఎందుకు జరుపుకొంటారు?

శివరాత్రి నాడు శివుడు విరామము తీసుకొంటారు. రాత్రిలో ఒక్క ‘ప్రహరము’ సమయమున ఆయన విరామము తీసుకొంటారు. ప్రహరము అంటే మూడు గంటల సమయము. ఎప్పుడైతే శివ భగవానుడు విరామము తీసుకొంటారో, అప్పుడు ‘శివ తత్త్వము’ ప్రక్షిపించబడదు, అంటే వారు ధ్యానవస్థలో ఉంటారు. ఈ సమయమున వారు తన వ్యక్తిగత సాధనకు సమయము ఇస్తున్నట్లుగా భావించాలి. ఆ సమయములో, శివతత్త్వము ఎట్టి తామసిక గుణమును గాని, బ్రహ్మండములోని హాలాహలమును గాని స్వీకరించదు. అందువలన చెడు శక్తుల ప్రభావము పెరుగుతుంది. ఈ ప్రభావము నుండి కాపాడుకోవడానికి ‘బిల్వ పత్రము’, తెల్లని పువ్వులు, ‘రుద్రాక్ష’లను శివునికి సమర్పిస్తారు. ఇవి వాతావరణములోని ‘శివ తత్త్వమును’ ఆకర్షించి చెడు శక్తుల ప్రభావము నుండి రక్షిస్తాయి. 


 

‘జ్ఞానం ఇచ్చేత్ సదాశివాత్ l
మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్ ll’
అనగా ఆధ్యాత్మిక జ్ఞానము కోసము శివుడిని మరియు మోక్షము కొరకు జనార్దుడిని(విష్ణువు) కొలవాలని అర్థము !

Friday, 12 September 2014

శంఖ నాదము

శంఖమును పూజలో రెండు విధములుగా ఉపయోగిస్తారు. పూజకు ముందు ఒక్క శంఖమును పూరిస్తారు, మరొక్కటి పూజలో ఉపయోగిస్తారు. ఏ శంఖమును అయితే పూరించడానికి ఉపయోగిస్తారో, దానిని పూజలో పెట్టకూడదు. శంఖమును పూరించకుండా దేవాలయ తలుపులను తెరువరాదని ‘వరాహ పురాణము’లో చెప్పబడినది. వాతావరణములో సత్త్వ, రజ, తమో గుణ తరంగములు ఉంటాయి. ఇందులో రాజ, తమ గుణములు చెడుదాయకమైనవి. పూజా సమయములో సత్త్వ తరంగములు ఆకర్శించబడుతాయి. ఇవి పూజ చేసేవారికి లభించకుండా చెడు తరంగములు ఇబ్బందిని కల్గిస్తాయి.


ఎప్పుడైతే పూజకు ముందు శంఖమును పూరిస్తామో, అప్పుడు శంఖము నుండి శక్తి వెలువడుతుంది. ఈ శక్తి చెడుదాయక తరంగములను నాశనము చేస్తుంది. దీనితో పాటుగా చైతన్య కవచము పూజా ఉపకరణముల చుట్టూ నిర్మాణము అవుతుంది.
శంఖ నాదము వలన మరొక్క లాభము కూడా ఉంది. శంఖమును పూరించినప్పుడు, బ్రహ్మాండములో గల విష్ణు తత్త్వము కార్యగతము అయ్యి, పూజా ప్రదేశంలో ఆకర్శించబడుతుంది. దీని వలన పూజా చేసే వారితో పాటుగా శంఖమును ఊదిన వారికీ, శంఖ నాదమును విన్నవారికి కూడా దీని లాభము కలుగుతుంది.

Sunday, 31 August 2014

శ్రీ గణేశుడు ఏకదంతుడు ఎలా అయ్యారు ?

కార్తవీర్యుడిని వధించిన తరువాత పరుశురాముడు కైలాషమునకు వెళ్లారు. అక్కడ అన్ని గణములతో కలిసి గణాధీషుడు ఉన్నారు. శంకురుడిని దర్శించుకోవాలనే ఇచ్చ పరుశురమునికి కలిగినది. కానీ, ఆ సమయములో శివ-పార్వతులు విశ్రాంతి తీసుకొనడము వలన గణేశుడు ‘కొద్ది సేపు నిరీక్షణ చెయ్యమని’ చెప్పారు.



కానీ పరశురాముడు వినకుండా చేతిలో పరశు ని తీసుకొని నిర్భయముగా వెళ్ళసాగారు. అప్పుడు గణేశుడు ప్రేమతో మరియు వినయముతో ఇంకోసారి ఆపారు. క్రోధముతో అతనిని చంపేందుకు పరశురాముడు పరశుని ఎత్తారు. అయిన సరే, ధర్మాన్ని సాక్షిగా తీసుకొని శ్రీ గణేశుడు అపసాగారు. అయిన పరశురాముడు వినకపోయే సరికి గణేశుడు తన తొండమును పెద్దగ చేసి పరశురాముడిని అందులో ఇరికించి సప్త లోకములలో త్రిప్పసాగాడు. అప్పుడు పరశురాముడు, గురు దత్త ఇచ్చిన స్తోత్ర కవచమును పటించి, పరశుని గణేశుని మీదకు విసురుతాడు.  దానిని వ్యర్థము చేసేందుకు శ్రీ గణేశుడు ఎడమ దంతమును విసురుతాడు. అప్పుడు పరశు అస్త్రము వ్యర్థము అవుతుంది; కానీ గణేశుని దంతము విరిగిపోతుంది.
 

Saturday, 30 August 2014

గణపతి పదమునకు అర్థము ఏమిటి ?

గణ+పతి = గణపతి, సంస్కృత నిఘంటువు అనుసారముగా 'గణ' అంటే పవిత్రకాలు. పవిత్రకాలు అంటే సుక్ష్మతి సుక్ష్మ చైతన్య కణాలు. 'పతి' అంటే పాలించేవాడు(స్వామి). గణపతి అంటే పవిత్రకములకు స్వామి అని అర్థము.





గణపతి దేవునికి వివిధ పేర్లు ఉన్నాయి. అవి -
వక్రతుండ, ఏక దంత, లంబోదర, భాలచంద్ర, వినాయక, మంగళ మూర్తి, విద్యాపతి, మరియు చింతామణి.

వివిధ యుగములలో వీరి అవతారములు -
మహోత్కట వినాయకుడు - సత్య యుగము
గుణేశ - త్రేతా యుగము
గజాననా - ద్వాపర యుగము
దుమ్రకేతు - కలి యుగము  (ఈ అవతారము కలియుగములో కానున్నది. ఈయన ధూమ్ర వర్ణములో ఉంది మ్లేచ్చులను నాశనము చేస్తారని భవిష్య పురాణములో చెప్పడమైనది.

Friday, 29 August 2014

శ్రీ గణపతికి గరికను ఎందుకు సమర్పిస్తారు ?




గరిక అనేది ఒక్క ప్రత్యేకమైన పవిత్ర గడ్డి. గణపతి దేవుని నుండి వెలువడే పవిత్రకములను ఇది ఎక్కువుగా గ్రహించి, ప్రక్షేపిస్తుంది. గరికలో మూల శివ, శక్తి మరియు గణపతి తత్త్వములను ఆకర్షించే శక్తి కూడా ఉంది. అందువలనే గరికను శ్రీ గణపతి పూజకు ఉపయోగిస్తారు. గణపతికి మూడు లేదా అయిదు ఆకులు గల గరికను సమర్పిస్తారు. గణపతికి  కనీసము 21 సంఖ్యలో గరికలను సమర్పించాలి. వీటిని కట్టి, నీళ్ళల్లో ముంచి అర్పించాలి. గణపతి దేవుని శిరస్సుని వదిలి మిగతా శరీర భాగమంతా గరికతో కప్పవలెను. ఇందువలన గరికలోని సుగంధము మూర్తి చుట్టూ వ్యాపిస్తుంది.