Monday, 28 April 2014

కర దర్శనము

ఉదయము నిద్ర నుండి లెగువగానే రెండు చేతులను బొమ్మలో చూపిన మాదిరిగా దోసిలిగా పెట్టి, మనస్సుని ఏకాగ్రతతో ఆ చేతి వంక చూస్తూ, కర దర్శనమును చేసుకొంటారు. అప్పుడు ఈ శ్లోకమును చదువుతారు.




కరాగ్రే వసతే లక్ష్మీ: కర మధ్యే సరస్వతీ l
కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ll

అర్థము : చేతికి అగ్రభాగమున లక్ష్మీదేవి నివాసము ఉంటుంది. మధ్యభాగమున సరస్వతి దేవి ఉంటారు , మూల భాగమున గోవిందుడు ఉంటారు ; కావున ఉదయము నిద్ర నుండీ మేల్కొనగానే చేతిని దర్శించుకోనవలెను.

శ్రీ రాముని ఆదర్శము



రామ రాజ్యములో అందరు సుఖముగా ఉండేవారు: కానీ ప్రస్తుతము ప్రజాస్వామ్యము అనే రావణ పాలనలో అందరు దుఃఖములో ఉన్నారు. సంతోషముగా అందరు ఉండాలంటే ప్రస్తుత రాక్షస పాలన చేస్తున్న దేశ విద్రోవులను ప్రారదోలి రామ రాజ్యమును స్థాపించాలి. ఇది సాధించడానికి, ఆధ్యాత్మిక సాధన మరియు భక్తీ చేయవలసిన అవసరము ఎంత అయిన ఉంది.







ఆదర్శ పుత్రుడు : తల్లిదండ్రుల మాటలను తుచ తప్పకుండ పాటించారు;
ఆదర్శ సోదరుడు : రామ-లక్ష్మణుల ప్రేమను ఇప్పడికి ఆదర్శముగా తీసుకొంటారు.
ఆదర్శ భర్త : ఒక్కే ఒక్క భార్యకు కట్టుబడి ఉన్నారు. రాజులకు అంటే చాల మంది భార్యలు ఉండేవారు.
ఆదర్శ మిత్రుడు : క్లిష్ట పరిస్తుతుల్లో ఉన్న సుగ్రీవుడు, విభీషునుడు మరియు చాల మంది స్నేహితులకు అయన సహాయము చేసారు.
ఆదర్శ రాజు : వేదములలో చెప్పిన రాజుకి కావాల్సిన గుణాలను అన్నింటినీ ఆయన అనుసరించారు.
ఆదర్శ శత్రువు : విభీషునుడు తన సోదరుడు అయిన రావణుడికి అంత్య సంస్కారాలను చెయ్యడానికి తిరస్కరించినప్పుడు, ‘’నువ్వు చేయకపొతే, నేను చేస్తాను. అతను నాకు కూడా సోదరుడే’’ అని పలికారు.
మర్యాద పురుషోత్తముడు : వారు ధర్మమునకు అనుగుణముగా ప్రాతినిధ్యము వహించారు.

దేవునికి గంధమును ఎందుకు పెడతారు?



ఎప్పుడైతే మనము గంధమును దేవుని నుదిటి యందు పెడతామో, ఆ గంధములో గల సువాసన, రంగు, దేని నుండి ఆ గంధము తయారు అయ్యిందో, దాని వలన అ దేవుని సూర్య నాడి జాగృతమవుతుంది. అదే సమయములో ఆ దేవుని తత్త్వము ఆ విగ్రహములో ఆకర్శించబడుతుంది. దీని పర్యవసానముగా ఆ విగ్రహము దైవీ చైతన్యముతో నిండిపోతుంది. అన్నింటిలోకల్ల అష్ట గంధము, చందనము సత్త్వ ప్రధానమైనవి.


Friday, 25 October 2013

తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ కడుతున్నందుకు విరుద్ధముగా దేశమంతట ఆందోళనలు

 ETVకి తిరుపతిలో భూమికి సంబంధించిన పత్రమును చూపుతున్న శ్రీ చేతన్ జనార్ధన్

మధురైలో ఆందోళన...

 తిరుపతిలో నిర్మాణములో ఉన్న ఇస్లామిక్ యూనివర్సిటీ
భాగ్యనగరములో ఆందోళన... - తిరుపతిలో ఇస్లామిక్ విశ్వ విద్యాలయ కట్టడాన్ని నిరసిస్తూ హిందూ జన జాగృతి సమితి మరియు ఇతర హిందు సంస్థలు కలిసి అబిడ్స్, కలెక్టరేట్ ఆఫీసు ఎదురుగ 8 th, october ఉదయము 11 గంటలకు అందోళన నిర్వహించాయి. ఇందులో ౬౦ మందికి పైగా ధర్మాభిమానులు పాల్గొన్నారు. తరువాత కలెక్టర్ గారికి మెమొరాండం సమర్పించడము జరిగినది.

 భాగ్యనగరములో వివిధ హిందుత్వవాదులతో చర్చ

 కంచి కామ పీఠాధిపతి గారికి వివరిస్తున్న దృశ్యం

తిరుపతిలో ప్రెస్ మీట్

Tuesday, 18 June 2013

కేదార్నాథ్ లో వరదలు-భీభత్సము

కేదార్నాథ్ లో వరదలు-భీభత్సము , చాల మంది మృత్యువాత, లక్ష మందికి పైగా నిరాశ్రయులు !!
अतिवृष्टि: अनावृष्टि: शलभा मूषका: शुका: ।
स्वचक्रं परचक्रं च सप्तैता ईतय: स्मृता: ॥ - कौशिकपद्धति

(రాజు ధర్మాచారి కాకపోతే ప్రజలు ధర్మాన్ని పాటించరు. ప్రజలు ధర్మాచరణ చెయ్యకపోతే) అతివృష్టి, అనావృష్టి, మిడతల ఆక్రమణ, ఎలుకల స్వైర విహారం, చిలుకల ఉపద్రవము, అందరి మధ్య కొట్లాటలు, శత్రువుల ఆక్రమణ మొదలగు ఏడు రకముల ప్రమాదాలు నెలకోంటాయి..
దీని తాత్పర్యము ఏమనగా రాజు, ప్రజలు ఇద్దరు కూడా సాధన చెయ్యాలి. అప్పుడే దేశము, ధర్మమూ సురక్షితముగా ఉండి, ఎటువంటి సంకటాలు రావు..

కావున మీ దినచర్యలో సాధనకు కూడా చోటుని ఇవ్వండి. రోజుకి కనీసము ఒక్క గంట అయిన సమయమును కేటాయించండి. ''శ్రీ కుల దేవతయై నమః'' అని నామ జపమును చెయ్యండి. మీ కుల దేవత వెంకటేశ్వర స్వామి అయితే ''శ్రీ వేంకటేశాయ నమః'' అని చెయ్యండి.

Sunday, 5 May 2013

అక్షయ తృతీయ

‘’మదనరత్న’’ పవిత్ర గ్రంథములో వైశాఖ తృతీయ గురించి చెప్పబడినది.
(శ్రీ కృష్ణుడు చెబుతారు) ఓ యుధిష్టిరా, ఈ రోజు చేసే దానము మరియు హోమము ఎప్పడికి క్షయము కావు.
ఈ కారణము చేతనే ఋషి-మునులు ఈ తిథికి అక్షయ తృతీయ అని పేరు పెట్టారు. ఈ రోజు చేసే దానము వలన పుణ్యాబలము పెరుగుతుంది. దీని ఫలితముగా దానము చేసిన వ్యక్తికీ స్వర్గప్రాప్తి లభించును. అక్షయ తృతీయ నాడు దేవతలు మరియు పితురులకు తృప్తి కొరకు చేసే కర్మ కూడా అక్షయము అనగా అవినాశము అవుతుంది.  
అక్షయ తృతీయ మూడున్నర ముహుర్తలలో ఒకటి. ఈ రోజున త్రేతాయుగము ఆరభము అయ్యిందని కొన్ని చోట్ల చెబుతారు. ఈ రోజున అభ్యంగస్నానము మరియు దాన ధర్మాలు చేస్తారు. ఈ రోజున విష్ణు భగవానునికి పూజను చెయ్యడము, నామజపము చెయ్యడము, హోమాలు మరియు పిత్రుతర్పణమును చేస్తారు. కొందరు సూర్యుడి ఎండ నుండి కాపాడుకొనుటకు గొడుగులను మరియు చెప్పులను కూడా దానము చేస్తారు.
ఈ రోజున ఎవ్వరైతే ‘సత్పాత్ర దానము’(అనగా ధనమును స్వీకరించే వ్యక్తీ, ఆ దానమునకు సత్పత్రుడు అయ్యి ఉండాలి)ను చేస్తారో, వారు పూర్వ జన్మలో చేసిన పాపములు తగ్గి, మోక్ష మార్గ దిశగా ముందుకు వెళ్ళతారు. అందుకనే దానము చేస్తే సత్పాత్రునికే చెయ్యాలి.
ఈ రోజున ఉన్నత లోకముల నుండి సాత్త్విక లహరులు భూమి మీదకు ప్రసరిస్తాయి. అందుకని మరణించిన కొన్ని లింగ దేహములు ఆ సాత్వికతను పొంది ఉన్నత లోకాలను పోవాలని పరితపిస్తుంటాయి. అందువలన ఈ రోజు పితురులకు తిల తర్పణము చేస్తారు. జలము మరియు నువ్వులను కలిపి దేవతలు మరియు పితురులకు సమర్పించడమే తిల తర్పణము. ‘తిలము’ సాత్వికమైనవి మరియు జలము భావమునకు ప్రతీకమైనది.
తిల తర్పణము చేసేటప్పుడు ‘నేను భగవంతునికి సమర్పిస్తున్నాను’  అనే అహం భావమును ప్రదర్శించకుండా ‘భగవంతుడే నా నుండి చేయించుకొంటున్నారు’ అనే భావముతో సమర్పిస్తే ఆ దేవతలు ఎక్కువ ప్రసన్నము అవుతారు.



తిల తర్పణము చేసే పద్దతి
మొదట దేవతలను ఆహ్వానించాలి. ఒక్క సాత్విక ప్లేటుని (రాగి గాని వెండి గాని) తీసుకోవాలి. బ్రహ్మను మరియు విష్ణుమూర్తిని లేదా వారిద్దరు గల దత్త రూపమును ఆ ప్లేటులో ఆహ్వానించాలి. తరువాత, దేవతలు నిజముగానే మన ఎదుట ఉన్నారు అనే భావమును పెట్టుకోవాలి. ‘నువ్వుల’ను చేతిలో తీసుకొని శ్రీ విష్ణు మరియు బ్రహ్మ తత్త్వము ఆ నువ్వులలో ఉంది అనే భావముతో దేవతల చరణాలకు అర్పించాలి. 
మరొక ప్లేటుని తీసుకోవాలి. మన పితురులు ఎదురుగ ఉన్నట్లుగా భావించాలి. నువ్వులలో దేవతల తత్త్వము వస్తుంది అనే భావమును పెట్టుకోవాలి. రెండు నిమిషాల తరువాత దేవుని సాత్వికత అందులో వచ్చింది అని భావిస్తూ పితురుల చరణముల మీద వదులుతున్నాము అనే భావముతో తిల తర్పణము చెయ్యాలి.
అహం భావము లేకుండా. పూర్తీ భావముతో ఎంతగా పైనే చెప్పినది చేస్తాము అంతగా మనలో సాత్వికత లభిస్తుంది మరియు పితృ ఋణమును తీర్చిన వాళ్లము అవుతాము.
అధిక వివరాలకు http://www.hindujagruti.org/hinduism/festivals/akshay-tritiya/ చుడండి..