Sunday 31 August 2014

శ్రీ గణేశుడు ఏకదంతుడు ఎలా అయ్యారు ?

కార్తవీర్యుడిని వధించిన తరువాత పరుశురాముడు కైలాషమునకు వెళ్లారు. అక్కడ అన్ని గణములతో కలిసి గణాధీషుడు ఉన్నారు. శంకురుడిని దర్శించుకోవాలనే ఇచ్చ పరుశురమునికి కలిగినది. కానీ, ఆ సమయములో శివ-పార్వతులు విశ్రాంతి తీసుకొనడము వలన గణేశుడు ‘కొద్ది సేపు నిరీక్షణ చెయ్యమని’ చెప్పారు.



కానీ పరశురాముడు వినకుండా చేతిలో పరశు ని తీసుకొని నిర్భయముగా వెళ్ళసాగారు. అప్పుడు గణేశుడు ప్రేమతో మరియు వినయముతో ఇంకోసారి ఆపారు. క్రోధముతో అతనిని చంపేందుకు పరశురాముడు పరశుని ఎత్తారు. అయిన సరే, ధర్మాన్ని సాక్షిగా తీసుకొని శ్రీ గణేశుడు అపసాగారు. అయిన పరశురాముడు వినకపోయే సరికి గణేశుడు తన తొండమును పెద్దగ చేసి పరశురాముడిని అందులో ఇరికించి సప్త లోకములలో త్రిప్పసాగాడు. అప్పుడు పరశురాముడు, గురు దత్త ఇచ్చిన స్తోత్ర కవచమును పటించి, పరశుని గణేశుని మీదకు విసురుతాడు.  దానిని వ్యర్థము చేసేందుకు శ్రీ గణేశుడు ఎడమ దంతమును విసురుతాడు. అప్పుడు పరశు అస్త్రము వ్యర్థము అవుతుంది; కానీ గణేశుని దంతము విరిగిపోతుంది.
 

Saturday 30 August 2014

గణపతి పదమునకు అర్థము ఏమిటి ?

గణ+పతి = గణపతి, సంస్కృత నిఘంటువు అనుసారముగా 'గణ' అంటే పవిత్రకాలు. పవిత్రకాలు అంటే సుక్ష్మతి సుక్ష్మ చైతన్య కణాలు. 'పతి' అంటే పాలించేవాడు(స్వామి). గణపతి అంటే పవిత్రకములకు స్వామి అని అర్థము.





గణపతి దేవునికి వివిధ పేర్లు ఉన్నాయి. అవి -
వక్రతుండ, ఏక దంత, లంబోదర, భాలచంద్ర, వినాయక, మంగళ మూర్తి, విద్యాపతి, మరియు చింతామణి.

వివిధ యుగములలో వీరి అవతారములు -
మహోత్కట వినాయకుడు - సత్య యుగము
గుణేశ - త్రేతా యుగము
గజాననా - ద్వాపర యుగము
దుమ్రకేతు - కలి యుగము  (ఈ అవతారము కలియుగములో కానున్నది. ఈయన ధూమ్ర వర్ణములో ఉంది మ్లేచ్చులను నాశనము చేస్తారని భవిష్య పురాణములో చెప్పడమైనది.

Friday 29 August 2014

శ్రీ గణపతికి గరికను ఎందుకు సమర్పిస్తారు ?




గరిక అనేది ఒక్క ప్రత్యేకమైన పవిత్ర గడ్డి. గణపతి దేవుని నుండి వెలువడే పవిత్రకములను ఇది ఎక్కువుగా గ్రహించి, ప్రక్షేపిస్తుంది. గరికలో మూల శివ, శక్తి మరియు గణపతి తత్త్వములను ఆకర్షించే శక్తి కూడా ఉంది. అందువలనే గరికను శ్రీ గణపతి పూజకు ఉపయోగిస్తారు. గణపతికి మూడు లేదా అయిదు ఆకులు గల గరికను సమర్పిస్తారు. గణపతికి  కనీసము 21 సంఖ్యలో గరికలను సమర్పించాలి. వీటిని కట్టి, నీళ్ళల్లో ముంచి అర్పించాలి. గణపతి దేవుని శిరస్సుని వదిలి మిగతా శరీర భాగమంతా గరికతో కప్పవలెను. ఇందువలన గరికలోని సుగంధము మూర్తి చుట్టూ వ్యాపిస్తుంది.