Friday 19 September 2014

"హొలీ"


దీనికే మరో పేరు "రంగపంచమీ"
హొలీ పుట్టుక గూర్చి మన "భవిష్య పురాణం " ఈ విధంగా చెప్తోంది.
పూర్వం ఒక వూరిలో ఓక దుష్ఠ శక్తి పిల్లల్ని విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తూ ఆనందాన్ని పొందేది. ఒక రోజు ఆ ఊరి ప్రజలు అందరు ఆ దుష్ఠ శక్తిని తులనాడుతూ, తిడుతూ ఒక నిప్పు వెలిగించి మొత్తం ఊరు నుంచి దానిని తరిమేశారు.
 

పురాణేతిహాసపరంగానైతే "హిరణ్యకసుపుడు " అఖిలాండ బ్రహ్మాండనాయకుడైన నారాయుడి పై ద్వేషముతో ముల్లోకాలను పీడిస్తుండగా ఆతని కుమారుడైన ప్రహ్లాదుడు సర్వం విష్ణు మయం అని ఆతని భక్తుడైనాడు. అది రుచించని ఆతని తండ్రి తన సహొదరి అయిన హొలికకు ప్రహ్లాదుని తీసుకుని అగ్ని గుండం పై కూర్చోమన్నాడు. హోలికకు ఉన్న వరప్రసాదం వలన తనకు ఏమి కాదు అనుకున్న హొలిక అలాగే కూర్చోగానే, ఒడిలో వున్నా ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణలో వుండగా ఆతని అత్త కాలి బూదిడ అయినది. ద్వేషం పై కోపం పై అన్యాయం పై భక్తీ గెలిచిన ఈ రోజున హొలీ చేసుకుంటారు.
హొలీ రోజున హొలికదహనమ్ చేస్తారు. ఇందులోని సదుద్దేశం ఏమిటంటే దహనానికి వాడే అన్ని కూడా ప్రకృతిని శుద్ధి చేసే వనమూలికల వృక్షపు బెరల్లు మొదలగునవి. వీటి ద్వారా ప్రకృతిలో జేరిన దుష్టశక్తిని ప్రాలద్రోలవచ్చునని మన పూర్వికుల నమ్మకం. దహనం పూర్తి అయిన తర్వాత దానిపై నేతిని, పాలని చల్లుతారు. తర్వత భందువులకి స్నేహితులకి పళ్ళు పలహారాలు పంచి రంగుల పంచమి మొదలు పెడతారు
పండుగ:- ఈ పండుగను ఒకొక్కరు ఒక్కోక విధంగా జరుపుకొనుచున్నారు
కొన్ని ప్రాంతాలలో డోలయాత్ర ,శింగ ,హుతషని మహోత్సావ్ ,కామదహనం , వసంతోత్సవ్ అని వివిధ పేర్లతో జరుపుకోనుచున్నారు
కొన్ని ప్రాంతాలలో వసంత ఋతువును ఆహ్వానించుటకు ఈ పండగను చేస్తారు. ఆ ఆ ప్రాంతాలు బట్టి పండుగ చేసుకునే రోజులు కూడా పెరుగుతాయి. ప్రకృతి సహజమైన రంగులను అందరు చల్లుకుంటూ ఆనందాన్ని, ఆత్మీయతను తమ లోగిలిలోకి రావాలని అందరు సంతోషంగా వుండాలని ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ మీ జీవితాలలోకి సంతోషాన్ని సంపదనుతేవాలని మనస్పూర్తిగా మీ అందరికి హొలీ శుభాకాంక్షలు.

No comments:

Post a Comment