Friday 19 September 2014

నాగ పంచమి

తన తండ్రి పాము కాటు వలన చనిపోవడముతో జన్మేజయ రాజు సర్ప యజ్ఞమును చేస్తారు. అప్పుడు అస్తిక మహర్షి వచ్చి రాజుని శాంతింపజేస్తారు. జన్మజేయుడు వరము కోరమని అడుగగా, సర్పయజ్ఞమును ఆపివేయమని మహర్షి అడుగగానే, జన్మజేయుడు సర్ప యజ్ఞమును అపివేస్తాడు. ఆ రోజే శ్రావణ శుక్ల పక్ష పంచమి..అదే నాగ పంచమి.


శ్రీ కృష్ణుడు ఏ రోజైతే కాల నాగుని యమునా నది వదిలి వెళ్ళమని చెబుతాడో, ఆ రోజే శ్రావణ శుక్ల పక్ష పంచమి..
భగవద్గీతలో తన గురించి వర్ణిస్తూ, శ్రీ కృష్ణుడు ‘‘నాగులలో కల్లా పెద్దది అయిన ‘అనంత’ని కూడా నేనే..’’అని చెబుతారు.
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం I
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం, కాలియం తథా II
తొమ్మిది ప్రకారముల నాగులు – అనంత, వాసుకి, శేషుడు, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక మరియు కాలియ లను పూజిస్తే సర్ప భయము తొలిగిపోతుంది.
ఈ రోజు క్రొత్త బట్టలు వేసుకొంటారు. పసుపుతో తొమ్మిది నాగులను గీసి, వాటికి పూజ చేస్తారు. ఈ రోజున కొయ్యడము, వేయించడము, పొయ్యిని వెలిగించడము చెయ్యరు. తవ్వడము కూడా ఈ రోజు నిషేధమైనది.

No comments:

Post a Comment