Thursday 22 May 2014

మహాభారతమును ‘ధర్మ యుద్ధము’ అని ఎందుకు అంటారు ?


మహాభారతములోని మొదటి మూడు రోజులలో అనేక కౌరవ బంధువులు మరియు వీరులు పాండవుల చేతిలో మరణించారు. పాండవుల పక్షములో ఏ ప్రముఖ సేనాని మృత్యువు కూడా అప్పటి వరకు అవ్వలేదు. అప్పుడు దుర్యోధనునికి కోపము వచ్చి, భీష్ముడిని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ‘రేపు 5 బాణాలతో అయిదుగురు పాండవులను చంపుతాను’ అని అంటారు. అప్పుడు దుర్యోధనుడు ‘ఏ అయిదు బాణాల చేత చంపదలుచుకోన్నారో, ఆ బాణాలు నాకు ఇవ్వండి. ఉదయమే నేను తెచ్చి ఇస్తానని’ అంటాడు. అప్పుడు భీష్ముడు అయిదు బాణాలను మంత్రించి దుర్యోధనుడికి ఇస్తాడు.
 
ఈ విషయము శ్రీ కృష్ణ భగవానునికి తెలిసిపోతుంది. అప్పుడు అయన ఒక ఉపాయము చెబుతారు. పాండవులు వనవాసములో ఉన్నప్పుడు, దుర్యోధనుడు ఒక్కసారి అరణ్యమునకు వెళ్ళతాడు. ఆ సమయములో అర్జునుడు అతని ప్రాణాలను రక్షిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఏదైనా వరమును కోరమన్నప్పుడు, ‘అవసరము వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడు తప్పక తీర్చమని’ అర్జునుడు చెబుతాడు.
శ్రీ కృష్ణుడు అర్జునుడి యుద్ధ శిబరమునకు వెళ్లి ఆ అయిదు బాణాలను దుర్యోధనుడిని అడిగి తీసుకు రమ్మంటాడు. అర్జునుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి ఆ అయిదు బాణాలను అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు తాను ఇచ్చిన మాట అనుసారముగా ఆ అయిదు బాణాలను అర్జునుడికి ఇచ్చేస్తాడు; అందుకే ఈ యుద్దమును ‘ధర్మ యుద్ధము’ అని అంటారు.

No comments:

Post a Comment